ప్రణాళిక లోని సూత్రములుమేము ఈ క్రింది సూత్రములను అనుసరిస్తున్నాము:

విలువైన సాఫ్టువేరుని నిరంతరముగా మరియు అతి త్వరగా
వినియోగదారునికి అందిచి సంతృప్తి పరచడమే
మా అత్యున్నత ప్రాధాన్యము.

సాఫ్టువేరు నిర్మాణములో ఎప్పుడైనను మార్పును ఆహ్వానించాలి.
చంచలమైన ప్రక్రియలు మార్పుకు స్పందించి వినియోగదారునకు
తమ ప్రత్యర్థులపైన ప్రయోజనములు చేకూర్చును.

తక్కువ వ్యవధికి ప్రాధాన్యత ఇస్తూ, వారముల నుంచి
నెలల గడువులో నిరంతరము ఉపయోగకరమైన
సాఫ్టువేరుని వినియోగదారునకు అందించాలి.

ప్రాజెక్టు ఆరంభము నుండి అంతము వరకు, ప్రతి రోజూ
వ్యాపారవేత్తలు మరియు సాఫ్టువేరు బృందము తప్పక కలసి పని చేయాలి.

ప్రోత్సాహముతో కూడిన వ్యక్తుల మధ్య ప్రాజెక్టుల నిర్మాణము చేపట్టాలి.
చేపట్టిన ప్రాజెక్టుల పర్యంతము వారిని విశ్వసించి, వారికి అవసరమైన
ఉద్యోగ వాతావరణము మరియు ఇతర సహకారములు అందించాలి.

సాఫ్టువేరు బృందము మధ్య ఒక ప్రయోజనాత్మకమైన
సమాచార సరఫరా పద్ధతి కేవలము
ముఖాముఖి సంభాషణములు మాత్రమే.

ప్రాజెక్టు పురోగతికి ఉపయోగాత్మకమైన సాఫ్టువేరు తయారి ఒక ప్రాధమిక కొలమానము.

చంచలమైన ప్రక్రియలు స్థిరమైన గమనంతో కూడిన నిర్మాణమును ప్రోత్సాహిoచును.
వినియోగదారులు, నిర్మాణకర్తలు, మరియు వాడుకరులు కచ్చితముగా
ఒక స్థిర గమనముతో అనిర్దిష్టకాలముపాటు సాఫ్టువేరు నిర్మాణం చేపట్టాలి.

సాంకేతిక ప్రాశత్త్యము మరియు ఉత్తమ సాఫ్టువేరు రూపకల్పనపై నిత్యము
ఆశక్తి కలిగి ఉండుట వలన సాఫ్టువేరు నిర్మాణ చంచలత్వము అధికమగును.

సరళత--అనవసరమైన కార్యముల మొత్తమును
అత్యల్పము చేయుట అనే కళ--అత్యవసరము.

శ్రేష్టమైన నిర్మాణములు, అవసరములు, మరియు రూపకల్పనలు
స్వయం నియంత్రితమైన సాఫ్టువేరు బృందము యొక్క కృషి నుండి వెలువడును.

నియతీకాలములో సాఫ్టువేరు బృందము సప్రయోజకముగా
మార్పుచెందుటకు యోచిoచును, తదుపరి తమ ప్రవర్తనను
సవరించుకొని అనుకూలంగా మార్చుకొనును.
Return to Manifesto